పీఏసీఎస్ మల్లూరు పరిధిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
నిజాంసాగర్ అక్టోబర్ 28( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని పీఏసీఎస్ మల్లూరు పరిధిలో(PACS Mallur Area) రైతుల సౌకర్యార్థం వడ్డేపల్లి, జక్కాపూర్, మల్లూరు తండా గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మల్లూరు పీఏసీఎస్ చైర్మన్ భుజంగారి వినోద వెంకట్రామిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్ లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల ప్రారంభంతో రైతులకు ధాన్యం విక్రయించేందుకు స్థానికంగానే సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విక్రయించుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి స్థానిక ప్రజాప్రతినిధులు, పీఏసీఎస్ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.