ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జాతీయ మానవ హక్కుల ప్రత్యేక ప్రతినిధి

30-09-2026 | 07:57pm

నిజాంసాగర్ సెప్టెంబర్ 30( విజయ క్రాంతి )కామారెడ్డి జిల్లా నిజాం సార్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), న్యూఢిల్లీకి చెందిన జోన్-XII ప్రత్యేక ప్రతినిధి శ్రీ దేవేంద్ర కుమార్ బుధవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న బహిరంగ రోగుల సేవలు అంతర్గత రోగుల సేవలు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.

ఈ-సంజీవని టెలిమెడిసిన్ సేవలు, ఈ-సంజీవని కాల్స్, టెలీ కన్సల్టేషన్ సేవలు గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం మొత్తం పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు మరియు వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై  వివరాలు అడిగి తెలుసుకున్నారు.అయన వెంట బాన్సువాడ ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి,కామారెడ్డి జిల్లా డి ఎం ఎచ్ ఓ డా. వెంకటి నిజాంసాగర్ తహసీల్దార్ సాయి బుజంగారావు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రోహిత్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు