ఎకో టూరిజం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

17-10-2026 | 05:13pm

నిజాంసాగర్ అక్టోబర్ 17( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు(Nizamsagar Project) గోల్ బంగ్లా వద్ద నిర్మిస్తున్న ఏకో టూరిజం(Ecotourism) పనులను జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు(Thota Lakshmikanta Rao) శనివారం నాడు పరిశీలించారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో 14 ఎకరాల్లో నిర్మిస్తున్న కాటేజీ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి  పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కాంట్రాక్టర్కు సూచించారు. ఆయన వెంట డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజాపరి, అచ్చంపేట సహకార సంఘ అధ్యక్షులు పట్లోళ్ల జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు