దివ్యాంగ బాలబాలికలకు మండల స్థాయి క్రీడా పోటీలు

02-11-2026 | 04:28pm

నాగల్‌గిద్ద, నవంబర్ 2 (విజయ క్రాంతి): నాగల్‌గిద్ద మండలంలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో దివ్యాంగ బాలబాలికలకు మండల స్థాయి క్రీడా పోటీలను(Mandal-level sports competitions) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే లక్ష్యంతో వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో దివ్యాంగ బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

ఆటల పోటీల్లో విజయం సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఇలాంటి పోటీలు వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగల్ గిద్ద కాంప్లెక్స్  ప్రధానోపాధ్యాయులు మారుతి జాదవ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబు శెట్టి, ఉపాధ్యాయులు శేరి విజేందర్ రెడ్డి, సంగమణి, ఐఈఆర్‌పీ ఉపాధ్యాయురాలు కవిత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు