ఎల్లగిరి వద్ద అండర్‌పాస్ నిర్మించాల్సిందే!

02-11-2026 | 05:05pm

NH-65 దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే

ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రమాద మరణాలు – కలెక్టర్‌కు గ్రామస్థుల వినతి

ఆలేరు,(విజయక్రాంతి): హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి–65పై చౌటుప్పల్ మండలం ఎల్లగిరి కాన్సోర్ట్ వద్ద వెంటనే వెహికల్ అండర్‌పాస్ బ్రిడ్జి (VUP) నిర్మించాలని స్థానిక గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. రహదారి దాటే సమయంలో ప్రమాదాలు జరిగి ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, రైతులు, విద్యార్థులు, వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో జాతీయ రహదారిని దాటడం ప్రాణసంకటంగా మారిందన్నారు. హెచ్చరిక బోర్డులతో సమస్య పరిష్కారం కాదని, ప్రజల ప్రాణభద్రత కోసం ఎల్లగిరి వద్ద VUP నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

మరిన్ని వార్తలు