మురసు తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

02-11-2026 | 05:16pm

అధికారుల సెలవులు రద్దు

క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ

24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): మురసు తుపాను(Murasu Cyclone) ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్(Collector Hemant Keshav Patil) అధికారులను ఆదేశించారు. సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వాగులు, వంకల వద్ద రాకపోకలు నిలిపివేయాలన్నారు. నల్లమల ఘాట్‌ రోడ్డులో ప్రత్యేక నిఘా ఉంచాలని, రైతులు పంటలను కాపాడుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అత్యవసర సహాయం కోసం 98667 56825 నంబర్‌లోని 24 గంటల కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు