యువ నాయకుడికి ఘన సన్మానం

02-11-2026 | 05:07pm

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా పేరపు ఆనంద్‌కు గుర్తింపు!

యువజన సమస్యలపై పోరాడాలి

భవిష్యత్తులో బీజేపీ అధికారమే లక్ష్యం – మైదం భాస్కర్

ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district) భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన పేరపు ఆనంద్‌కు ఆలేరు(Aler)లో ఘన సన్మానం లభించింది. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సేవా సంస్థ ఆలేరు ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షుడు మైదం భాస్కర్ నేతృత్వంలో ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్‌కు శాలువా కప్పి, ఛత్రపతి శివాజీ మెమొంటో అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మైదం భాస్కర్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి బాధ్యతలు చేపట్టిన పేరపు ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో యువజన సమస్యలపై నిరంతరం పోరాడుతూ, యువతకు అండగా నిలవాలని సూచించారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ(Pandit Deendayal Upadhyaya) ఆశయాలను దేశవ్యాప్తంగా విస్తరించాలన్నారు. జనసంఘ్ స్థాపకుల్లో ఒకరైన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాల స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ నేడు ప్రపంచ దేశాలకు భారతదేశ గొప్పతనాన్ని చాటుతోందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పోటీపడుతూ ముందుకు సాగడం గర్వకారణమన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చి పార్టీ జెండా ఎగురవేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆలేరు మున్సిపాలిటీ ఐదో వార్డు కౌన్సిలర్ పాశికంటి సంపత్ పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఆనంద్‌ను సత్కరించారు.

జనని స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ సలహాదారుడు జూకంటి సిద్ధులు కూడా శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుజ్జ ఉదయ్, ఆలేటి శ్రీకాంత్, వాల్లోజు సురేష్, చింతకింది వినయ్, కొమ్ము శ్రవణ్, చింతకింది రవి, అంబటి సతీష్, జిల్లా రమేష్, కావతారపు సాయికృష్ణ, కందుకూరి శరత్, చింతకింది వెంకటేష్, పేరపు యశ్వంత్, సాయి గణేష్, సన్నీ, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు