నిరసనల ఎఫెక్ట్.. బాలీవుడ్ నటుడికి హైకోర్టు షాక్!

02-11-2026 | 05:09pm

ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు (Bombay High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికా పౌరసత్వం కలిగిన ఆయన భారత్‌లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యవహారంపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నిరసనల్లో పాల్గొన్నందుకు బేషరతుగా క్షమాపణలు (Unconditional Apology) చెప్పాలని స్పష్టం చేసింది.

అంతేకాకుండా, భవిష్యత్తులో భారత్‌లో ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనబోనని లిఖితపూర్వక హామీ (Undertaking) ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు, ఆయనకు జారీ చేసిన ‘లీవ్ ఇండియా’ నోటీసుపై (Leave India Notice) విధించిన స్టేను పొడిగించింది. కోర్టు ఆదేశాలతో ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు