గుండంపల్లిలో ‘సర్కారు బడి’ పాట షూటింగ్
ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను చాటిచెప్పడమే లక్ష్యం
మల్లాపూర్, నవంబర్ 2 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో సోమవారం లింగంపల్లి నరేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారు బడి’(Government School) పాట షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య క్లాప్ కొట్టి షూటింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా పాట దర్శకుడు లింగంపల్లి నరేష్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ పాటను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న విద్యా సౌకర్యాలు, వాటి ప్రాముఖ్యతను పాట రూపంలో ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పాట ద్వారా తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగడంతో పాటు, ప్రభుత్వ విద్యపై మరింత అవగాహన కలుగుతుందని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, మాజీ సర్పంచ్ మామిడి లక్ష్మారెడ్డి, వీడీసీ సభ్యులు అంతడుపుల గంగాధర్, మారు శేఖర్ రెడ్డి, పాల్తేపు రాజారెడ్డి, కల్వకుంట నరేష్, గొర్రె మోహన్, దప్పుల నరేష్, గుర్రపు సతీష్, ముత్యాల లక్ష్మీనారాయణ, మార్గం మారుతి, సామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.