చంద్రకళ కుటుంబానికి వీసీ ఆర్థిక సహాయం

02-11-2026 | 05:19pm

ముకరంపుర, నవంబర్ 2(విజయ క్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలో(Satavahana University) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన ఎల్.ఎల్.బి ద్వితీయ సంవత్సరం(Second Year of LL.B.) విద్యార్థిని షాద్ నగర్ రంగారెడ్డి జిల్లాకు చెందిన దక్కాలి చిన్నయ్య కూతురు చంద్రకళ  కుటుంబానికి అండగా నిలిచేందుకు విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌  ప్రకటించిన సహాయాన్ని శాతవాహన యూనివర్సిటీ జేఏసీ స్వాగతిస్తోంది.

చంద్రకళ కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించి, తక్షణమే రూ.1.5 లక్షలు అందించడం, మిగిలిన మొత్తాన్ని వారం రోజుల్లో అందిస్తామని హామీ ఇవ్వడం, కుటుంబంలోని ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించడం అభినందనీయమని  ఎస్ యు జె ఎ సి  పేర్కొంది. అయితే, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఘటనకు కారణమైన వారిని గుర్తించి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని  ఎస్ యు జె ఎస్ సి  డిమాండ్ చేస్తోంది. చంద్రకళ కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు