అమిత్ షా మహా పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన బీజేపీ శ్రేణులు
మణికొండ, నవంబర్ 2 (విజయక్రాంతి): కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) పాల్గొన్న మహా పాదయాత్రకు రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మణికొండ, నెక్నాంపూర్ ప్రాంతాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద ప్రారంభమైన పాదయాత్ర మొజంజాహి మార్కెట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మణికొండ, నెక్నాంపూర్‌కు చెందిన పార్టీ శ్రేణులు కాషాయ జెండాలు చేతబూని, అమిత్ షాకు మద్దతుగా నినాదాలు చేస్తూ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
యువత, మహిళలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సంఘీభావాన్ని చాటుకున్నారు. ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో యాత్రా ప్రాంగణం మార్మోగింది. అమిత్ షా పర్యటనతో తెలంగాణలో పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొందని స్థానిక బీజేపీ నాయకులు పేర్కొన్నారు.