మైనార్టీ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ పైవేటు
- నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం
- ఒకే రోజు ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్ లు
- అధికారులు వెరిఫికేషన్ చేయలేదా...?
- అడ్డదారిలో ఉద్యోగం
- ఇంటర్ బోర్డు లీలలు
కామారెడ్డి, నవంబర్ 9 (విజయక్రాంతి): ఇంటర్ బోర్డు(Intermediate Board) లీలలు ఇంతింత కాదయ్యా అనే సామెత ను కామారెడ్డి మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఇంతియాజ్(Imtiaz, Principal of the Kamareddy Minority Residential Junior College) వ్యవహారం చూస్తే అర్థమవుతుంది. చదువుకోకుండానే నకిలీ సర్టిఫికెట్లు(Fake Certificates) సృష్టించి ఉద్యోగం పొందడమే కాకుండా ఏకంగా ప్రిన్సిపల్ గా అవతారం ఎత్తారు. అతని నకిలీ సర్టిఫికెట్ల(Fake Certificates) వ్యవహారం ఉన్నతాధికారుల విచారణలో బట్టబయలు అయింది. ఫేకు సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందడమే కాకుండా ప్రిన్సిపల్ గా ఇంతియాజ్ కొనసాగుతున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఇంతియాజుపై వేటు వేసింది. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపుతుంది.
ఇంతియాజ్ చదువుకున్న సర్టిఫికెట్లకు పొంతనలేదు. ఉద్యోగం మాత్రం పొందడమే కాకుండా ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు ఇంతియాజ్. పదవ తరగతి తెలంగాణ ఓపెన్ పరీక్షలు రాసి పాస్ కాగా ఇంటర్, డిగ్రీ, పిజి సర్టిఫికెట్లను చూస్తే విస్తూ గొలుపేలా ఉన్నాయి. మైనార్టీ గురుకులo లో ఉద్యోగం ఏ విధంగా పొందాడు. సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసిన అధికారులకు కళ్ళు కనిపించలేదా..? అనే అనుమానం కలగక మానదు. ఇంతియాజ్ పొందిన సర్టిఫికెట్లు చూస్తుంటే ఇంత గుడ్డిగా ఉద్యోగం ఎలా ఇచ్చారు.
అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతే కాకుండా ఏకంగా ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్న ఇంతియాజుకు ఇంటర్ బోర్డు అధికారులు, మైనార్టీ శాఖ అధికారులు ఏ విధంగా సహకరించారు ఎందుకు సహకరించారు. అనే సందేహం కలుగక మానదు. అతని సర్టిఫికెట్లను చూస్తే ఒకే రోజు ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు పొందినట్లు సర్టిఫికెట్లపై ఉంది. సర్టిఫికెట్లలో సైతం పొంతన లేని మార్కులు ఉన్నాయి. ఇంత గుడ్డిగా సర్టిఫికెట్లను చూసి ఉద్యోగం ఇచ్చారా అంటే ఇంతియాజ్ సర్టిఫికెట్లను చూస్తే సందేహం కలగక మానదు.
ఏ విధంగా మేనేజ్ చేశాడు ఎవరెవరిని మేనేజ్ చేశాడో కానీ గుడ్డిగా ఉద్యోగం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయకముందు మైనార్టీ గురుకుల శాఖ ద్వారా ఔట్సోర్సింగ్ లెక్చరర్ గా ఉద్యోగంలో చేరిన ఇంతియాజ్ ప్రభుత్వం పర్మినెంట్ చేయడంతో లెక్చరర్ గా పర్మినెంట్ కావడంతోపాటు ప్రస్తుతం ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రిన్సి పాల్ గా ఇంతియాజ్ కొనసాగుతున్నారు. నకిలీ సర్టిఫికెట్లపై ఉద్యోగం పొందారని విచారణ జరుగడంతో ఇంతియాజ్ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం బయటపడింది.
దీంతో ఇంటర్ బోర్డు అధికారులు ఇంతియాజును సస్పెండ్ చేశారు. దీంతో నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం పొందిన వ్యవహారం కామారెడ్డి జిల్లాలో బట్టబయలైంది. ప్రభుత్వం ఇంతియాజ్ పై వేటు వేసింది ఇన్ని రోజులు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేసి వేతనాలు పొందారు. వాటిని ప్రభుత్వం రికవరీ చేస్తుందా? లేక ఎలా వ్యవహారిస్తుందో వేచి చూడాల్సిందే. ఇంటర్ బోర్డు లీలలు ఇంతింత కాదయా అనడానికి ఇంతియా జ్ సర్టిఫికెట్లు, ఉద్యోగం పొందడం చూడడం చక్కటి ఉదాహరణ.