మొక్కజొన్నలో సమగ్ర సస్యరక్షణపై అవగాహన

08-10-2026 | 04:55pm

భిక్కనూర్, అక్టోబర్‌ 8 (విజయ క్రాంతి):  భిక్కనూర్‌ మండలం గుర్జకుంటలో మొక్కజొన్న పంటపై(Maize crop) రైతు పొలంబడి కార్యక్రమాన్ని CIPMC హైదరాబాద్‌, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ హొన్నప్పగౌడ పురుగులు, సహజ శత్రువుల గుర్తింపు, AESA, NPSS యాప్‌ వినియోగంపై అవగాహన కల్పించారు.

శాస్త్రవేత్త డా. అనిల్‌రెడ్డి సమగ్ర పురుగు, తెగుళ్ల యాజమాన్య పద్ధతులను వివరించారు. మండల వ్యవసాయ అధికారి నాగరాజు పంటను క్రమం తప్పకుండా పరిశీలించి IPM పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంతోష్‌రెడ్డి, ఏఈఓ రాజేష్‌, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు