తెరుచుకొని హోమియోపతి వైద్యశాల...
తాడ్వాయి, అక్టోబర్, 02 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలోని హోమియోపతి వైద్యశాల(Homeopathy Hospital) శుక్రవారం తెరుచుకోలేదు. రోజంతా తాళం వేసి దర్శనమిచ్చింది. ప్రభుత్వ సెలవులు ఉన్న వైద్యశాలలు అత్యవసరమైన సేవలలో ఉన్నందున మధ్యాహ్నం ఒకటి గంటల వరకు అయినా వైద్యశాలలు తెరుచుకొని పని చేయాలనే నిబంధనలు ఉన్నాయి.
కానీ అందుకు భిన్నంగా హోమియోపతి వైద్యశాలకు తాళం వేసి ఉంది. అక్కడే ఉన్న పశువైద్యశాలకు సైతం తాళాలు వేసి ఉన్నాయి. ఈ విషయమై ప్రజలు మాట్లాడుతూ... అత్యవసర సేవలు అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్యశాలలు, పశువైద్యశాల తెరుచుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్యశాలలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.