సత్యాగ్రహం, అహింస మార్గంలో స్వాతంత్ర్యం సాధించిన మహానేత
గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి గంగాధర్
శివంపేట్ అక్టోబర్ 2 ( విజయక్రాంతి ): శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను(Gandhi Jayanti Celebrated ) కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సంఘ సేవకులు బండారి గంగాధర్ (Bandari Gangadhar)ఆధ్యర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బండారి గంగాధర్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకుని అహింసా మార్గంలో స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపారని అన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటం, సేవలను స్మరించుకున్నారు గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్బంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జీజీఅర్ యువసేన అధ్యక్షుడు కుమ్మరి నాగరాజు, బండారి నాగేష్, బండారి ముత్యాలు, 10వ వార్డు . మెంబర్ కమల్ కిషోర్, 1వ వార్డు మెంబర్ గాండ్ల లత ఆంజనేయులు, పిల్లి చంద్రయ్య, . కొత్తపల్లి నాగరాజు, గాండ్ల దాసు, పిల్లి సురేష్, రంగప్ప బాలరాజూ, పిల్లి మధు, పిల్లి మణికంఠ . తదితరులు పాల్గొన్నారు.