మహాత్ముడి బాటలో నడవాలి...
తాడువాయి లో ఘనంగా గాంధీ జయంతి ఉత్సవాలు...
తాడ్వాయి,అక్టోబర్, 02( విజయ క్రాంతి): ప్రతి ఒక్కరు మహాత్ముడు చూపిన బాటలో నడవాలని ప్రతినిధులు తెలిపారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో శుక్రవారం గాంధీ జయంతి ఉత్సవాలు(Gandhi Jayanti Celebrated) ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహాత్ముడి విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రతినిధులు మాట్లాడుతూ... మహాత్ముడు దేశ స్వాతంత్రం కోసం ఎనలేని కృషి చేశారని తెలిపారు.
ఆయన అహింస మార్గంలో హింసకు తావు లేకుండా పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చాడని కొనియాడారు. ఆయన పోరాటం చిరస్మరణీయమన్నారు.ఈ కార్యక్రమంలో నందివాడ,ఎర్ర పహాడ్,తాడువాయి, దేమికలాన్, బ్రాహ్మణపల్లి, కృష్ణాజివాడి,బ్రహ్మాజీ వాడి,ఏండ్రి,యాల్, చందాపూర్ సర్పంచులు సంకు పోచయ్య, మల్లవ్వ, విజయ రాములు, భైరవి రాజిరెడ్డి, సుమలత రామరాజు, అంజనీ భాయి రఘుపతిరావు, నర్సింలు,మంగారెడ్డి,చాకలి ఎస్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజయ్య,ఉప సర్పంచులు నవీన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,రనీల్ రెడ్డి, నర్సారెడ్డి డ్వాక్రా గ్రూప్ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.