విద్యాసంస్థల నేతకు సన్మానం
గురువేందర్ రెడ్డి నీ సన్మానించిన బీడీఎస్ఎస్ ప్రతినిధులు
కామారెడ్డి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలను నెలకొల్పి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న విద్యాసంస్థల నేత గురువేందర్ రెడ్డిని(Guruvender Reddy, Head of Educational Institutions) మంగళవారం కామారెడ్డి బీడీఎస్ఎస్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
ఎంతోమందికి ఉన్నతవిద్యను, ఉపాధిని అందిస్తూ స్కూల్ విద్యకొరకు బి టాపర్స్,ఇంటర్ విద్యకొరకు ఆర్యభట్టా జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఐఐటి -జేఈఈ, ఎన్ ఈ ఈ టి లాంటి ఉన్నతమైన విద్యను కార్పొరేట్ స్థాయిలో అందించేందుకు ఆర్యభట్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో కౌటిల్యా అకాడమీ, డిగ్రీ, పీజీ విద్య కొరకై శ్రీనిధి, మంజీరా కళాశాలలు నడుపుతూ తెలంగాణాలోనే అత్యున్నత విద్యా ప్రమాణాలతో విద్యార్థులకు తల్లిదండ్రులకు చేరువైన ఆర్యభట్టా విద్యాసంస్థల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి ని సన్మానిస్తూ అభినందనలు తెలిపారు.
బి డి ఎస్ ఎస్ సంఘ సభ్యులు, ఈ కార్యక్రమం లో 46వ వార్డ్ కౌన్సిలర్ , గేరిగంటి లక్ష్మీనారాయణ, తాటిపల్లి సునీల్, బొడ్డు శ్రావణ్, కాకర్ల రవి , చెన్నం బాలు, హితీష్ ,సాయి తదితరులు పాల్గొన్నారు.