ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఘనత కాంగ్రెస్ కే దక్కుతుంది..
22-09-2026 | 07:39pm
తాడ్వాయి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): అందరికీ ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని తాడ్వాయి మండల ఎంవైఎఫ్ అధ్యక్షులు పట్లోళ్ల ప్రసాద్ రావు(MYF President Patlolla Prasad Rao) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ప్రజలకు అందిస్తున్న పథకాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం అందరికీ ఉచిత విద్యుత్తును అందించి ఆదుకుంటున్నదని తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ, రైతులకు రైతు భరోసా కార్యక్రమం, ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రోడ్ల నిర్మాణం, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ తదితర కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు.