క్రీడల్లో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
22-09-2026 | 07:35pm
కొత్తగూడెం సెప్టెంబర్ 22 విజయక్రాంతి: కొత్తగూడెం మండల స్థాయిలో 70వ ఆటల పోటీలు,పాఠశాల క్రీడా ఎంపికలు కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగాయి.. ఈ సందర్భంగా కొత్తగూడెం మండల విద్యాశాఖాధికారి మధురవాణి(Education Officer Madhuravani) మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ,ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని,ప్రతి పాఠశాలలో ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
ప్రగతి మైదానంలోని ప్రాంగణాన్ని సందర్శించించి, క్రీడాకారులు గాయాల పాలు కాకుండా, ఫస్ట్ ఎయిడ్ కిట్ ను అందుబాటులో ఉంచాలని పి ఈ టి ,పీడీ ల కు సూచించారు . ఎం ఈ ఓ తో హలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పి ఈ టి,పీడీ లు పాల్గొన్నారు.