అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట ధ్వంసం

24-09-2026 | 08:24pm

-రూ.20 వేల ఆస్తి నష్టం

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామ శివారులో బుధవారం రాత్రి అడవి పందుల దాడి(wild boar attack)లో మొక్కజొన్న పంట ధ్వంసం(Corn crop destroyed) అయినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన సామ సురేష్ రెడ్డి ఒక ఎకరం మొక్కజొన్న పంట(Corn crop)ను అడవి పందులు పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ ధ్వంసంలో  రూ.20 వేల ఆస్తి నష్టం జరిగినట్లు వారు తెలిపారు.అధికారులు స్పందించి బాదిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ సంకు పోచయ్య  కోరారు.

మరిన్ని వార్తలు