సర్పంచ్‌ పద్మ స్వామి కుటుంబానికి మండల సర్పంచుల పరామర్శ

25-10-2026 | 04:38pm

భిక్కనూర్, అక్టోబర్‌ 25 (విజయక్రాంతి): భిక్కనూర్‌ మండలం(Bhikkanur Mandal) బస్వాపూర్‌ గ్రామ సర్పంచ్‌ తుడుం పద్మ స్వామి తండ్రి తుడుం రామయ్య మృతి చెందడంతో ఆదివారం మండల సర్పంచులు ఆయన కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. బస్వాపూర్‌లోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో భిక్కనూర్‌ సర్పంచ్‌ బాల్యాల సుదర్శన్‌ రేఖ, పెద్దమల్లారెడ్డి సర్పంచ్‌ సాయిగౌడ్‌, మల్లుపల్లి సర్పంచ్‌ నారాయణ, కాచాపూర్‌ సర్పంచ్‌ జ్యోతి సంతోష్‌, అయ్యవారిపల్లి సర్పంచ్‌ సత్యం, రాగట్లపల్లి సర్పంచ్‌ భాగ్యమ్మ నీలంరెడ్డి, కంచర్ల సర్పంచ్‌ అరుణ స్వామి, ఇస్సన్నపల్లి సర్పంచ్‌ రాములు, కాంగ్రెస్‌ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు