ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా బాల సాయిలు
27-09-2026 | 04:33pm
తాడ్వాయి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ అధ్యక్షుడిగా కానగళ్ల బాల సాయిలు ఎన్నికయ్యారు. తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ సమావేశంలో బాల సాయిలును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అధికార ప్రతినిధిగా ఈరమొళ్ల నరసింహులు, ప్రధాన కార్యదర్శిగా మెట్టు చరణ్, సహాయ కార్యదర్శిగా గడ్డం రవీంద్రలు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టు వెంకట రాములు, జాతీయ నాయకులు కంది పద్మారావు,రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి సత్తిగారి లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు బుజ్జి,జిల్లా సీనియర్ నాయకులు ధ్యామని భూపతి,తిమోతి రాజలింగం,రాజు, పోచయ్య, అశోక్, బక్కరాజు తదితరులు పాల్గొన్నారు.