కథనం కదిలించింది.. అధికారుల సర్‌ప్రైజ్ చెకింగ్

01-10-2026 | 12:28pm

గద్వాల జిల్లా, అలంపూర్: అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమయపాలనపై ఈ నెల 29న ‘విజయక్రాంతి’లో ‘సమయపాలనకు సెలవు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో (Government Offices) ఆకస్మిక తనిఖీలు (Surprise Inspections) చేపట్టారు.

ఎంపీడీవో రాఘవ బుధవారం పీహెచ్‌సీ (PHC), మహిళా సమైక్య, ఐసీడీఎస్ (ICDS), పశువైద్యశాల (Veterinary Hospital)తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను (Records) పరిశీలించి ఉద్యోగుల హాజరు (Attendance) తీరుపై ఆరా తీశారు.పీహెచ్‌సీలో పలువురు ఉద్యోగులు సమయానికి విధులకు హాజరుకాకపోవడంపై ఎంపీడీవో అసహనం వ్యక్తం చేశారు. ఇకపై విధులకు సమయపాలనతో (Punctuality) హాజరై తమ పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. సమయపాలన పాటించకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు (Strict Action) తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు