ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
గణపురం,(విజయక్రాంతి): భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న ఇందిరాగాంధీ(Prime Minister Indira Gandhi) వర్ధంతి సందర్భంగా గణపురం మండలం ధర్మారావుపేట గ్రామం(Ganapuram Dharmaraopeta village)లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాళ్లపెళ్లి భాస్కర్ రావు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలను, ఆమె ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ధర్మారావుపేట సర్పంచ్ పూజారి రాజేందర్, గౌడ్ వెంకటేశ్వర్లపల్లి సర్పంచ్ ముప్పిడి నాగరాజు, బసవపల్లి గ్రామ అధ్యక్షుడు కట్ల మల్లయ్య, ధర్మారావుపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు జీలకర్రపు సాయిలు, గండు శీను, మాడ శంకర్, ఆరెండుల శంకర్, మద్ది దేవేందర్, కటకం స్వామి, ఆకుల సదయ్య, ఆకుల రవి, ఆకుల రవీందర్, ఆకుల సుభాష్, గందె ప్రకాష్, ఊరేటి రాజయ్య, కోదాటి మురళి, ఆకుల రమేష్, ఆకుల చింటూ, దూలం శంకరయ్య, మాడ లింగయ్య, బొల్లం రవీందర్, గంపల స్వామి, చిన్నపాక చిరంజీవి, మాల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.