నూతన ఎక్సైజ్ అధికారులను కలిసిన గౌడ సంఘం నాయకులు..
28-09-2026 | 07:32pm
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): భూపాలపల్లిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎక్సైజ్ సీఐ, ఎస్ఐలను తెలంగాణ గౌడ సంఘం(Telangana Goud Sangam) జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో చల్లగరిగ గ్రామానికి చెందిన నూతన గౌడ సంఘం అధ్యక్షులు పోశాల కృష్ణమూర్తి గౌడ్, ఏరుకొండ రాజేందర్ గౌడ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గౌడ సంఘానికి సంబంధించిన పలు అంశాలతో పాటు సంఘం సభ్యుల సంక్షేమం, సమాజ అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్నేహపూర్వకంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పోశాల రమేష్ గౌడ్, మూల తిరుపతి గౌడ్, ఏరుకొండ రాజు గౌడ్, సహదేవ్ గౌడ్, ఏరుకొండ చిన్నరాజు గౌడ్ పాల్గొన్నారు.