భక్తిశ్రద్ధలతో గౌడ కులస్తుల కార్తీక వనభోజనాలు

26-11-2026 | 08:56pm

భూపాలపల్లి, నవంబర్ 26 (విజయ క్రాంతి): భూపాలపల్లి పట్టణంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో గురువారం కార్తీక వనభోజనాలు(Karthika Vanabhojanalu) భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వనభోజనాల్లో పాల్గొన్నారు. చిన్నారులు ఆటపాటలతో సందడి చేయగా, కులబాంధవుల ఆత్మీయ కలయికతో కార్యక్రమం సందడిగా సాగింది.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బుర్ర రమాదేవి సదానందం, మాజీ కౌన్సిలర్ ముంజాల రవీందర్, మాజీ జెడ్పీటీసీ కంకటి రాజవీరు, లారీ అసోసియేషన్ అధ్యక్షుడు పులి వేణు, ఏపీఓ సునిత, హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ నాగపురి సమ్మయ్య, బుర్ర కుమారస్వామి, పెరుమాండ్ల తిరుపతి, ముత్యాల రాజబాబు, తడుక సుధాకర్, తాళ్లపల్లి శ్రీనివాస్, కోల తిరుపతి తదితరులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు