పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ

20-09-2026 | 06:59pm

మహబూబ్ నగర్ జిల్లా గండీడ్, సెప్టెంబరు 20, విజయక్రాంతి: మండల పరిధిలోని కొమిరెడ్డిపల్లి గ్రామంలో (Komireddypalli) పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపన అక్టోబర్ 18న ప్రతిష్టాపించేందుకు  ఆదివారం ఘనంగా భూమిపూజ నిర్వహించారు. ముదిరాజ్ సంఘం (Mudiraj Sangam)మండల అధ్యక్షులు బోయిని గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, ముదిరాజ్ సంఘం నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొమిరెడ్డిపల్లి గ్రామంలో పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపనకు విగ్రహ దాతగా టైగర్ రవీంద్ర ముందుకు రావడం పట్ల ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

ఐక్యతకు ప్రతీకగా కార్యక్రమం జరిగింది 

ముదిరాజ్ సంఘం సభ్యులు ఐక్యంగా ముందుకు సాగుతూ సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. గ్రామంలో పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ జెడ్పీటీసీ ఎం శ్రీనివాస్ రెడ్డి,నీరటి రాములు,ఉపసర్పంచ్ జంగల్ల భీమయ్య, ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షులు శాఖ వెంకటయ్య,హర్షవర్ధన్, నరసయ్య, ఆంజనేయులు,బోయిని శ్రీనివాస్,జంగల్ల వెంకటయ్య,కే.గోపాల్, కుడుముల రాజు,వెంకట్, రాములుతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ముదిరాజ్ సంఘం సభ్యులు,గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు