ఘనంగా భజనలు డాన్సులతో గణేశ్ నిమజ్జనం
20-09-2026 | 07:04pm
బేల సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): బెల మండలం జూనోని గ్రామంలో గణేశ్ నిమజ్జన(Ganesh Immersion) మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామానికి చెందిన భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజన పాటలు పాడుతూ వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లారు. గ్రామ వీధుల ఈ శోభాయాత్రలో భక్తుల భజన కోలాహలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.