జిల్లా కేంద్రంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

02-10-2026 | 08:03pm

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 02 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు గాంధీజీ సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాట్ల శ్రీనివాస్, ఇస్లావత్ దేవన్, చల్లూరి మధు, సుందర్, వెంకీ యాదవ్, పరమేశ్వరి, ప్రేమ్ కుమార్, పృద్వి, స్వామి, సహదేవ్, అరుణ్ రావు, బౌద్ధ రాజేష్, శ్రీనివాస్, శారద, చల్ల రేణుక, జంబోజు పద్మ, ఆఫీస్ హైమద్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు సురేష్, రాజు, నాగరాజు, విజయభాస్కర్, అఖిల్, సాయి, రత్నాకర్, యువజన కాంగ్రెస్ నాయకులు చరణ్, శివ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు