అక్టోబర్ 9న మెగా జాబ్‌మేళా
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి,(విజయక్రాంతి): నిరుద్యోగ యువత(Unemployed youth)కు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అక్టోబర్ 9న భూపాలపల్లి పుష్ప గ్రాండ్లో మెగా జాబ్‌మేళా(Mega Job Fair) నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyanarayana Rao) తెలిపారు. గురువారం ఐడీఓసీలో అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. మేళాలో 300కుపైగా కంపెనీలు పాల్గొననున్నాయని, 20 వేల మంది యువతను సమీకరించనున్నట్లు తెలిపారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridhar Babu) ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. గ్రామాల వారీగా ప్రచారం నిర్వహించి యువతను తరలించాలని, గ్రామీణ యువతకు ఉచిత రవాణా, భోజన సదుపాయాలు కల్పించాలని సూచించారు. గత జాబ్‌మేళాలో 2,770 మందికి ఉద్యోగాలు లభించాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈసారి అర్హులకు మేళా ప్రాంగణంలోనే ఇంటర్వ్యూలు నిర్వహించి నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు.