ఓట్ల తొలగింపుపై భగ్గుమన్న వామపక్షాలు!
జనగామ, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ఓట్లను అక్రమంగా తొలగించడం సరికాదని సీపీఐ, సీపీఎం వామపక్ష పార్టీల నాయకులు జనగామ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఓటర్ల జాబితా నుంచి పేదలు, బలహీన వర్గాల ఓట్లను తొలగిస్తూ బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమైన కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా (VOTERS LIST)లో అవకతవకలను నివారించి, అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పించాలని నాయకులు కోరారు.
ఓట్ల తొలగింపు అంశంపై వామపక్ష పార్టీల (LEFT PARTIES) నాయకులు ప్రభుత్వానికి, ఎన్నికల అధికారులకు తమ డిమాండ్లను వినిపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల ప్రక్రియ (ELECTION PROCESS) పారదర్శకంగా ఉండాలని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం (PROTEST) కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.