ఉద్యోగాల కోసం ఎదురుచూడొద్దు.. స్వయం ఉపాధితో ఎదగాలి!
– బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నెల్లుట్ల శ్రీనివాస్ గౌడ్
ఉప్పల్,(విజయక్రాంతి): యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకుని వ్యాపార రంగంలో ముందుకు సాగాలని బీఆర్ఎస్(BRS) సీనియర్ నాయకులు నెల్లుట్ల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మల్లాపూర్ డివిజన్(Mallapur Division) పరిధిలోని నాగలక్ష్మి నగర్ కాలనీలో “VS టీ & గేమ్ జోన్” నూతనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ గౌడ్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా ఆర్థికంగా ఎదగడంతో పాటు ఇతరులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. యువత చేపట్టే మంచి ప్రయత్నాలకు సమాజం ప్రోత్సాహం అందించాలని సూచించారు.యువత స్వయం ఉపాధి(Self-employment) వైపు అడుగులు వేయడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు, యువకులు, “VS టీ & గేమ్ జోన్” నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
