నల్లవాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

18-09-2026 | 11:43pm

సిర్గాపూర్ సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు (సుల్తానాబాద్) డ్యామ్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న సిర్గాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.

మృతురాలి వయస్సు, గుర్తింపు 40-46 సం" రెండు చేతుల మనికట్టుపై పచ్చబొట్టు, పింక్ కలర్ జాకెట్, మెడలో బంగారు రంగు తాడు, ఆకు పచ్చ రంగు చీర, పసుపు రంగు లంగా, కుడి చేతి మణికట్టుకు ఎరుపు రంగు ధారం, కాళ్ళకు మెట్టెలు లేవు మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ ఆచూకీ లేదా వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

మరిన్ని వార్తలు