ఫీజు బకాయిలు విడుదల చేయాలి

07-09-2026 | 11:12pm

అక్కన్నపేట,(విజయ్ క్రాంతి): అక్కన్నపేట పోలీస్‌స్టేషన్‌(Akkannapet Police Station) వద్ద సోమవారం బీజేవైఎం(BJYM ) రాష్ట్ర నాయకుడు కర్ణకంటి నరేశ్‌ నిరసన తెలిపారుచలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా అక్కన్నపేట పోలీసులు బీజేవైఎం నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు. విద్యార్థులకు రావాల్సిన రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు(BJP state president Ramachandra Rao) బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేశ్‌ పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టినట్లు నరేశ్‌ తెలిపారు.

విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమన్నారుఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలతో రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో బీజేవైఎం అక్కన్నపేట మండల అధ్యక్షుడు సలేంద్ర తిరుపతి ఉన్నారు

మరిన్ని వార్తలు