నగర రక్షణాధికారుల బాధ్యతలు

23-10-2026 | 05:05am

(కౌటిలీయం -2-36)

నాగరికో నగరం చింతయేత్..

రాజ్యాన్ని, రాజ్యప్రజలను రక్షించవలసిన బాధ్యత పాలకులకు ఉంటుంది. అరాచక శక్తులు(Anarchic forces) ప్రజల మధ్య న చేరి అల్లర్లను సృష్టించవచ్చు. దానిని ని వారించాలంటే పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పరచాలి. ఆ బాధ్యతను సమర్థవం తంగా నిర్వహించడానికి నగరంలో నివసించేవారి వివరాలు, కొత్తగా వచ్చేవారి వి వరాలు, వారి వృత్తులు, నివాసాలు మొదలైన సమాచారాన్ని క్రమబద్ధంగా సేకరించే వ్యవస్థను ఆచార్య చాణక్య సూచించారు. ఇదే అధికరణం, 35వ ‘సమాహర్తృడ’నే అధికారి తన పరిధిలో శాంతిభద్రతలను కాపాడవలసిన బాధ్యతలను చెప్పాడు. ఈనాటి కాలంలో అతడొక ‘రెవెన్యూ కమిషనర్’ పరిధిని పర్యవేక్షించే అధికారిగా భా వించవచ్చు. సమాహర్తృ విస్తృత పరిపాలనా పరిధిని పర్యవేక్షించే వాడు కాగా ‘నా గరిక’ అనే అధికారి నగర స్థాయిలో నిర్దిష్ట బాధ్యతలను నిర్వహించేవాడు.

‘నాగరిక’ అనగా నగరాధికారి (సిటీ సూపరింటెండెంట్) అధికారాల ను, బాధ్యతలను గూర్చి వివరించాడు.. చాణక్య. నాగరిక తన పరిధిలోని నగరాని కి సంబంధించిన అన్ని విషయాలను చూసుకోవాలి. అతనికి సహాయకుడుగా ‘గోపుడు’ అనగా విభాగాధిపతి ఉంటాడు. గోపుడు తన పరిధిలో దాదాపుగా నలుబది కుటుంబాలను పర్యవేక్షించాలి. ప్రతి కుటుంబంలో ఎందరు స్త్రీలు, పురుషులు, పిల్లలు ఉన్నారో వారి జాతి, వారి పేర్లు, వృత్తులు సమగ్రంగా తెలుసుకొని నమోదుచేయాలి. 

అలాగే ‘నాగరిక’ వద్ద ‘స్థానికుడు‘ అనే అధికారి ఉంటాడు. అతనిని రా జ్యంలో దాదాపుగా నాలుగవ వంతుపై అ ధికారం ఉన్న రెవెన్యూ అధికారిగా చెపుతారు. తన పరిధిలోని అన్ని బాధ్యతలను అతనే నిర్వహించాలి. అటుపై ‘ధర్మావసథులు’ అనబడే అధికారులు ఉంటారు. వారు ఉచితంగా బాటసారులు ఉపయోగించుకునే ధర్మశాలలను పర్యవేక్షించే అధి కారులు. వీరు బాటసారులుగా, భిక్షకులుగా వచ్చిన ప్రతి వ్యక్తి వివరాలు తెలుసు కొని, గోపునికి సమాచారాన్ని పంపి అతని అనుమతితో ధర్మశాలలలో వారికి వసతిని కల్పించాలి.

ఈ పద్ధతిలో కొత్తగా గ్రా మంలోకి వచ్చే వ్యక్తి ఎక్కడి నుండి వచ్చా డు, ఎక్కడికి వెళతాడు, ఎవరు అతనికి ఆశ్రయం ఇచ్చారు.. వారి పరిమితులు, వృత్తులు ఏమిటి.. అనే పలు వివరాలు నమోదయ్యేవి. కొంతకాలం క్రితం వరకూ, మన గ్రామీణ వ్యవస్థలో, స్థానికంగా భద్రతను పర్యవేక్షించడం లక్ష్యంగా పోలీస్ పటే ల్, మాలీ పటేల్ లాంటి గ్రామాధికారులు ఇలాంటి వివరాలు నమోదు చేసేవారు. కాలమేదయినా పాలనలో సమాచారం సేకరించడం మాత్రమే కాకుండా, ఆ సమాచారాన్ని బాధ్యతాయుతంగా వినియోగిం చడం కూడా ముఖ్యమే. అందుకనే ఈనా డు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే సందర్భంలో గోప్యత, చట్టబద్ధత, సమాచార భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వబడుతున్నది.

గ్రామంలో చిన్నచిన్న వృత్తు లు చేసేవారు తమ వద్ద పనులు చేసే వ్యక్తులకు తమ పనిస్థలాలలోనే ఆశ్రయమివ్వాలి. అలాగే వర్తకులు కూడా వర్తకప రంగా తమ వద్దకు వచ్చే వ్యక్తులకు తమవద్దనే ఆశ్రయం ఇవ్వాలి. అయితే ఒక వ స్తువును అమ్మేవాడిని, ఆ వస్తువులను అమ్మేవాడు మాత్రమే తన వద్ద ఉంచుకోవాలనే నియమం మాత్రం లేదు. ఏ వర్త కుడైనా ఏ వర్తకునికైనా తన వద్ద ఆశ్రయం ఇవ్వచ్చు.

అయితే వస్తువులను దేశం కాని దేశంలో అమ్మేవారిని అనగా విదేశీ వస్తువులను అమ్మేవారిని, కాలం కాని కాలంలో అమ్మేవారిని, అలాగే తనది కాని సరకులను అమ్మేవారిని అనగా వస్తువుల అమ్మకాలలో మధ్యవర్తిగా వ్యవహరించే వారిని గూర్చిన సమాచారం మాత్రం ముందుగా గోపులకు లేదా స్థానికులకు తెలియపరచాలి. పూటకూళ్ళ గృహాల యజమా నులు, వేశ్యలు, మద్యమాంస విక్రయదారులు వీలైన మేరకు తమకు పూర్వ పరిచ యం ఉన్నవారికే తమ గృహాలలో ఆశ్ర యం ఇవ్వాలి. అలాగే డబ్బు అధికంగా ఖర్చు చేసేవారి వివరాలను, సాహస కృ త్యాలను చేస్తూ ప్రజలను ఆకర్షించే వ్యక్తు ల వివరా లను కూడా సంబంధిత అధికారులకు తెలియజేయాలి.

ఇంటి యజమాని తమ ఇంటికొచ్చిన అతిథి వివరాలను సంబంధిత అధికారులకు తెలపాలి. అలాగే వైద్యు లు రహస్యంగా తమ వద్ద చికిత్సకు వచ్చిన వారి వివరాలను అధికారులకు అందించాలి. అలా ఇవ్వకపో తే.. వచ్చిన వారు నేరస్థులైతే ఆశ్రయమిచ్చిన వారు కూడా నేరస్థులుగా శిక్షార్హులౌతారు. వివరాలు ముం దస్తుగా ఇచ్చినట్లయితే వారా బాధ్యత నుండి విముక్తులౌతారు. దీనివల్ల ప్రాచీన నగర పాలనా వ్యవస్థలో ప్రజలలో జవాబుదారితనం, నియంత్రణ వ్యవస్థ, సమాచార సమన్వయం సాధ్యపడుతుందని భావించినట్లుగా కనిపిస్తుంది. 

ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బా ధ్యత నగర పాలకులకు ఉంటుంది. పగటిని నాలుగు భాగాలుగా విభజించి అం దులో మొదటి భాగంలో వంటను ఇంటి లో చేసుకోవచ్చు. కాని తదుపరి కాలంలో వంటను ఇంటి బయట చేసుకోవాలి. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు గాను ప్రతి గృహస్థు ఇంటి ముందు నీళ్ళు నింపి న అయిదు కుండలను, పెద్ద కఱ్ఱ తొట్టిని, నిచ్చెనను, గొడ్డలిని, చేట, అంకుశము, ఇంటికప్పు పైఉన్న ఆకులలములను లాగే సాధనాన్ని (కచగ్రాహిణి) అందుబాటులో ఉంచాలి. అలా ఉంచకపోతే అది జరిమానా వేయదగిన నేరంగా పరిగణిస్తారు.

అలాగే వీధులలో వేయికుండలలో నీటిని నింపి బారులుగా ఉంచాల్సి న బాధ్యత ‘నాగరిక’ అధికారికి ఉంటుంది. ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే దానిని ఆర్పడం సమష్టి బాధ్యత. ఎవరైనా గృహ స్థు ఆ అగ్నిమాపక ప్రక్రియలో పాల్గొనకపోతే అతనికి జరిమానా విధించేవారు. గృహస్థు అజాగ్రత్త వల్ల అగ్ని ప్రమాదం జరిగితే ఆ గృహస్థుకు జరిమానా విధించడం జరుగుతుంది. వీధిలో బూడిద లేదా చెత్తను వేస్తే అది జరిమానా విధించదగిన నేరంగా భావించబడుతుంది. వీధు ల్లో బురదను నిలిచేట్లు చేసినా, బూడిదను పోసినా దండనార్హులే. ఈ నియమాలను లోతుగా పరిశీలిస్తే ప్రమాదాలు సంభవించిన తర్వాత చర్యలు తీసుకోవడం మాత్ర మే కాకుండా, ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, అవసరమైన ఏర్పాట్లు చేయడం కూడా పాలన లో భాగమని భావించవచ్చు.  

పుణ్య స్థలాల్లోనూ, నీటి వసతి ఉండే స్థలాల్లోనూ మలవిసర్జన చేస్తే నేరంగా పరిగణిస్తారు. నగర పాలన అంటే కేవలం శాంతి భద్రతలను కాపాడటం మాత్రమే కాదు. నగర పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం, ఉమ్మడి ప్రదేశాల పరిరక్షణ కూడా దాని పరిధిలోకి వస్తాయనేది సార్వకాలిక అంశమే. అందుకే వీధుల పరిశుభ్రతను కాపాడటం, నీటి వనరులను కలుషితం కాకుండా సంరక్షించడం, వ్యర్థాల నిర్వహణలో పౌరులను భాగస్వామ్యులను చేయడం, ఉమ్మడి ప్రదేశాల వినియోగానికి సంబంధించిన నియమాలను అమలు చేయడం వంటి అంశాలపై చాణక్య దృష్టిని సారించాడు. దీనిని బట్టి ఆయన, ప్రజల వ్యక్తిగత ప్రవర్తనకు, సామాజిక సంక్షేమానికి మధ్య ఉన్న సంబంధాన్ని విసృత పరిధిలో దర్శించినట్లుగా భావించవచ్చు.

చాణక్య సూచించిన నగరపాలనా విధానాన్ని పరిశీలిస్తే, ప్రజల భద్రత, సమాచార సేకరణ, అధికారుల బాధ్యతలు, అగ్నిప్రమాదాల నివారణ, పరిశుభ్రత వంటి అంశాలకు ఆయన ఎంతటి ప్రాధాన్యమిచ్చాడో అవగతమవుతుంది. నగర పాలనలో అధికారుల పర్యవేక్షణ ఎంత ముఖ్యమో, ప్రజల సహకారం కూడా అంతే ముఖ్యమని ఈ నియమాలు తెలియజేస్తున్నాయి. కాలం మారినా, ప్రజల భద్రతను కాపాడటం, వనరులను సమర్థంగా వినియోగించడం, పౌర బాధ్యతను పెంపొందించడం వంటి పాలనా సూత్రాల ప్రాధాన్యం మాత్రం మారదు.

పాలకుర్తి రామమూర్తి

మరిన్ని వార్తలు