హ్యుందాయ్ బాయోన్ బుకింగ్స్ ప్రారంభం
నూతన ఆవిష్కరణలు, స్టైల్, అత్యాధునిక భద్రత మరియు భవిష్యత్తుకు సన్నద్ధమైన మొబిలిటీని కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించబడిన టెక్-ఎనేబుల్డ్ ఎస్‌యూవీ, తమ రాబోయే 'ఇంటెలిజెంట్ యుటిలిటీ వెహికల్' హ్యుందాయ్ బాయోన్(Hyundai Bayon) కోసం బుకింగ్స్ ప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(Hyundai Motor India Limited) ఈ రోజు ప్రకటించింది. హ్యుందాయ్ బాయోన్‌లో పొందుపరిచిన ఇన్‌బిల్ట్ జెనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్.. డ్రైవర్ మరియు వాహనానికి మధ్య మరింత సహజమైన, స్పష్టమైన పరస్పర చర్యలను సులభతరం చేస్తూ ఇంటెలిజెంట్ మొబిలిటీ అనుభవాన్ని అందిస్తుంది.
హ్యుందాయ్ బాయోన్ బుకింగ్స్ ప్రారంభం సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ శ్రీ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, "హ్యుందాయ్ మోటార్ ఇండియాలో, అర్థవంతమైన ఆవిష్కరణల ద్వారా మొబిలిటీ అనుభవాలను సరికొత్తగా నిర్వచించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. హ్యుందాయ్ బాయోన్.. అధునాతన సాంకేతికత, ఫ్యూచరిస్టిక్ డిజైన్ మరియు సమగ్ర భద్రతలను ఒక ఆకర్షణీయమైన ఎస్‌యూవీ ప్యాకేజీలో సజావుగా అనుసంధానిస్తూ, ఇంటెలిజెంట్ మొబిలిటీ పట్ల మా దార్శనికతను మూర్తీభవింపజేస్తుంది.
తమ వాహనాల నుంచి మరింత తెలివి, మరింత సౌకర్యం, మరింత ఆత్మవిశ్వాసం మరియు మరింత స్టైల్‌ను కోరుకునే నేటి తరపు భారతీయ వినియోగదారుల కోసం హ్యుందాయ్ బాయోన్ అభివృద్ధి చేయబడిందన్నారు. హ్యుందాయ్ బాయోన్ "ఇంటెలిజెన్స్ దట్ మూవ్స్" అనే తత్వంతో రూపొందించబడింది. ఇన్‌బిల్ట్ జెనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్‌తో, భారతీయ వినియోగదారులకు సజావుగా, కనెక్టెడ్ మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే మొబిలిటీ అనుభవం కోసం అధునాతన సాంకేతికత, కనెక్టెడ్ సౌలభ్యం మరియు భద్రతలను హ్యుందాయ్ బాయోన్ మిళితం చేస్తుంది. డ్రైవింగ్‌ను మరింత స్మార్ట్‌గా, సురక్షితంగా మరియు మరింత సహజంగా మార్చేలా హ్యుందాయ్ బాయోన్ యొక్క ప్రతి అంశం నిర్మించబడింది.