రిపోర్టర్ రమేష్ కు నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు

23-09-2026 | 07:15pm

సుల్తానాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): సీనియర్ పాత్రికేయులు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రిపోర్టర్ టి.కే రమేష్ బుధవారం గుండెపోటుతో మృతి చెందటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Vijaya Ramana Rao) అన్నారు.

రమేష్ మృతి మీడియా రంగానికి, వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అని, రిపోర్టర్ గా ఆయన అందించిన సేవలను, ఆయన చూపిన అంకితభావాన్ని ఎప్పటికీ మరువలేను అని, ఈ విషాద సమయంలో రమేష్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు, రమేష్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చింతకుంట విజయరమణ రావు అన్నారు, ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, కౌన్సిలర్లు మీడియా మిత్రులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు