పేకాట స్థావరంపై మెరుపు దాడి

23-09-2026 | 07:30pm

పేకాట రాయుళ్లు అరెస్ట్ ముగ్గురు  పరారీ

నిందితులపై చట్టపరమైన చర్యలు

జితేందర్ సింగ్ దర్యాప్తు అధికారి

జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోశాల సమీపంలో కొంతమంది వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి పత్తాలాడుతున్న సంఘటన చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం.... జవహర్ నగర్(Jawahar Nagar) పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్సై రమేష్ కు జవహర్ నగర్ గోశాల సమీపంలో కొంతమంది వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి మూడుముక్కలాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లారు. ఈ మేరకు అక్కడ ఆరుగురు వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి పత్తాలాడుతూ కనిపించారు. పోలీసులను గమనించిన ముగ్గురు వ్యక్తులు రవి, నాగరాజు, రాజు సంఘటనా స్థలం నుండి పారిపోయారు.

మిగిలిన ముగ్గురు వ్యక్తులైన పిట్టల బాలయ్య, ఎర్రగుంట రాజు, దేవరుప్పుల మహేష్ లను పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులపై పంచనామా నిర్వహించి వారి వద్ద నుండి రెండు సెట్ల ప్లేయింగ్ కార్డులు సుమారు రూ .6,950 రూపాయలు నగదు, రెండు మొబైల్ ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ సుమారు 20వేల వరకు ఉంటుందని సమాచారం. ఈ మేరకు ఎస్సై కే రమేష్ స్వయంగా  ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో సుమోటో కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి దర్యాప్తును సితేందర్ సింగ్ దర్యాప్తు అధికారి చేపట్టారు. ఈ సందర్భంగా దర్యాప్తు అధికారి జితేందర్ సింగ్ మాట్లాడుతూ పేకాటరాయుళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంతటి వారినైనా వదిలి పెట్టబోమని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు