ప్లేట్ల కోసం నీటిలోకి దిగితే మృత్యుపాశం

01-11-2026 | 12:31pm

జవహర్‌నగర్, నవంబర్ 1 (విజయక్రాంతి): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మల్కారం క్వారీలో ఇద్దరు యువకులు నీటిలో గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

యాప్రాల్‌కు చెందిన రక్షిత్ (19), మురారి (19), పీయూష్ (18), సియాన్ (18), రోహిత్ (18) అనే ఐదుగురు స్నేహితులు సరదాగా గడిపేందుకు మల్కారం క్వారీ వద్దకు వెళ్లారు. భోజనం చేసిన అనంతరం ప్లేట్లు శుభ్రం చేస్తుండగా కొన్ని ప్లేట్లు నీటిలో పడిపోయాయి.వాటిని బయటకు తీసేందుకు సియాన్ (18), రోహిత్ (18) నీటిలోకి దిగారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగి గల్లంతయ్యారు (Missing in Quarry).

ఈ ఘటనపై సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బందికి సమాచారం అందించి గాలింపు చర్యలు (Rescue Operations) చేపట్టారు. గల్లంతైన ఇద్దరు యువకుల ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

మరిన్ని వార్తలు