మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య
చందుర్తి,(విజయక్రాంతి): మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొమ్ము శివతేజ (19) అనే యువకుడు తల్లిదండ్రులు లేకపోవడంతో ప్రస్తుతం తన నానమ్మ, పెద్దనాన్న సంరక్షణలో ఉంటున్నాడు. తనకు తల్లిదండ్రులు లేరనే బాధతో శివతేజ అప్పుడప్పుడు తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. "అందరికీ అమ్మానాన్నలు ఉన్నారు.
నాకెవరూ లేరు" అంటూ బాధపడేవాడని, "నేను బ్రతకడం వృథా" అని పలుమార్లు ఏడ్చేవాడని వారు వెల్లడించారు. శుక్రవారం రోజు అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో తాను నివసిస్తున్న గదిలో లుంగీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చందుర్తి ఎస్సై జె. రమేష్ తెలిపారు.