అయ్యో తల్లి ఎంత పని చేసావ్!?

07-11-2026 | 06:41pm

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య 

మహబూబాబాద్,(విజయక్రాంతి): వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ కి చెందిన మమత తన ఇద్దరు పిల్లలతో కలిసి పాకాల సరస్సులో పడి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలు ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. అయితే ఇద్దరూ ముక్కు పచ్చలారని పసిపిల్లలను కన్నతల్లి తన వెంట తీసుకెళ్లి పాకాల సరస్సులో పడి చనిపోవడం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచి వేసింది. మృతదేహాలను బయటకు తీసి ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు