4 September, 2026 | 8:19 PM

తొర్రూరులో బ్లూ కోట్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి

04-09-2026 | 12:48pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు(Thorrur) పట్టణంలో భార్యాభర్తల మధ్య గొడవ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి సమయంలో డయల్ 112 ఫోన్ రావడంతో సంఘటన స్థలికి వెళ్ళిన బ్లూ కోట్ కానిస్టేబుల్(Blue Coat Constable) రామచంద్రుపై కత్తితో దాడి జరిగింది. ఈ సంఘటనలో గాయపడ్డ అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనకు పాల్పడ్డ గూగులోత్ కోటేశ్వర్(Googleoth Koteswar)ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.