హస్నాపూర్ లో అగ్నిప్రమాదం...

09-11-2026 | 12:35pm

దగ్ధమైన కిరాణా షాపు, 3 లక్షల పైగా ఆస్తి నష్టం

ఉట్నూర్, నవంబర్ 9 (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించి కిరాణా షాప్ దగ్ధమైంది. కిరాణా షాప్ యజమాని ఓసవార్ దత్త తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి కిరాణా షాప్ లో లక్ష్మీ పూజలు చేసి ఇంటికి వెళ్ళమని అర్ధరాత్రి సమయంలో మంటలు పొగలు రావడంతో గమనించి చుట్టుపక్కల వారితో మంటలు ఆర్పి వేశామని అప్పటికే కిరాణా షాప్ లోని సామాగ్రి దీపావళి పండుగ రోజున బంతిపూలు అమ్మిన నగదు 40,000 పూర్తిగా దగ్ధమయ్యాయి ఆయన ఆవేదనతో తెలిపారు.

ఈ ప్రమాదం లక్ష్మి పూజ కు పెట్టిన దీపం వల్ల జరిగిందా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా అర్థం కావటం లేదని ఆయన ఆవేదనతో తెలిపారు. కిరాణా షాప్ లో ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగి ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు. కిరాణా షాప్ నడుపుకొని ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారి దత్త  కిరాణా షాప్ దగ్ధంతో రోడ్డున పడ్డాడని ప్రభుత్వం ఆయన కాదు కొన్ని ఉపాధి మార్గం కోసం సహాయం చేయాలని నాయకులు వసంతరావు, ప్రజలు కోరారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ అగ్నిప్రమాదం వల్ల తాను ఉపాధి కోల్పోయా నని కిరాణా షాప్ యజమాని దత్త ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు