సెంటర్ లైటింగ్‌ని ప్రారంభించిన భట్టి విక్రమార్క
ముదిగొండ,(విజయక్రాంతి): మధిర నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాల్లో(Maa indiramma intlo diwali celebrations) పాల్గొన్న అనంతరం ముదిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆదివారం రాత్రి స్విచ్ ఆన్ చేసి, ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka ) మల్లు.ఈ కార్యక్రమం లో అధిక సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ఎన్నో ఏళ్ల నుండి అభివృద్ధికి నోచుకోని ముదిగొండ మండల కేంద్రాన్ని అభివృద్ధి పథం లో నడిపిస్తున్న భట్టి విక్రమార్క కి ప్రజలు ఆనంద భాష్పలతో హర్షం వ్యక్త పరిచారు.