తరగతి గదిలో తుపాకీ..పేలడంతో విద్యార్థికి గాయం

25-11-2026 | 05:14pm

కేరళ: పాఠశాల తరగతి గదిలో తొమ్మిదో తరగతి విద్యార్థి తుపాకీ తీసుకురావడం కలకలం రేపింది. స్నేహితులకు తుపాకీ చూపిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్ (Misfire) కావడంతో మరో విద్యార్థి చేతికి గాయమైంది. ఈ ఘటన కేరళలోని పాలక్కడ్ జిల్లా పరుదూర్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన తాతకు చెందిన పాత తుపాకీని పాఠశాలకు తీసుకొచ్చాడు. తరగతి గదిలో స్నేహితులకు గన్ (Gun) చూపిస్తున్న సమయంలో అది ప్రమాదవశాత్తు పేలింది. దీంతో మరో విద్యార్థి చేతికి గాయమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సినిమాల ప్రభావంతో స్నేహితుల ముందు గొప్పలు చెప్పుకునే క్రమంలోనే విద్యార్థి తుపాకీని పాఠశాలకు తీసుకొచ్చి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఆ తుపాకీకి సరైన లైసెన్స్ (License) లేదన్న అంశం కూడా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తుపాకీ పాఠశాలకు ఎలా వచ్చింది? దానికి అనుమతులు ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రత (Student Safety)పై ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని వార్తలు