హుజూరాబాద్‌లో చోరీ.. నగదు, వెండి మాయం
26-11-2026 | 10:08am
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ పట్టణంలో దొంగలు హల్‌చల్ చేశారు. పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలోని ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ.50 వేల నగదుతో పాటు 20 తులాల వెండిని అపహరించారు.
ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి దొంగల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. పట్టణంలోని నివాస ప్రాంతంలో జరిగిన ఈ చోరీ స్థానికంగా కలకలం రేపింది.