కొత్త సీ3 ఎయిర్‌క్రాస్ వేరియంట్ ఆవిష్కరణ

20-09-2026 | 05:05am

జూబ్లీహిల్స్ ‘ప్రైడ్ సిట్రోయెన్’ షోరూమ్‌లో కార్యక్రమం  

 హైదరాబాద్, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): ఫ్రెంచ్ దిగ్గజ కార్ల కంపెనీ సిట్రో యెన్(Citroen) తన నూతన సి3 ఎయిర్‌క్రాస్ మాక్స్ ఎన్‌ఏ వేరియంట్ ను జూబిలీహిల్స్‌(Jubilee Hills)లోని ‘ప్రైడ్ సిట్రోయెన్’ షోరూమ్‌లో(Pride Citroen Showroom) శనివారం ఆవిష్కరించి నగర మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. ఆటోమొబైల్ కొనుగోళ్లకు(Automobile purchases) పండుగ సీజన్ చాలా కీలకమైన సమయం కావడం తో, ఈ విస్తరించిన లైనప్ కస్టమర్లకు ఇంజిన్ ఎంపికలు, సీటింగ్ కాన్ఫిగరేషన్, ఫీచర్లు,  ధరల పరంగా మరిన్ని ఆప్షన్లను అందిస్తుం ది. ఇది పోటీ ఎక్కువగా ఉన్న ఎస్యూవీ విభాగంలో సిట్రోయెన్ స్థానాన్ని మరింత బలో పేతం చేస్తుంది.

సిట్రోయెన్ బసాల్ట్ ఇప్పుడు టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన కొత్త ‘యూ’ (వైవోయూ) వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించా రు. సి3 ఎయిర్‌క్రాస్ ఎస్యూవీ కూడా 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లో కొత్త ’యూ’ వేరియం ట్‌ను పొందింది. దీని ప్రారంభ ధర రూ. 10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇవి పండు గ సీజన్ ప్రత్యేక ప్రారంభ ధరలు. ఆ తర్వాత ఇవి మారే అవకాశం ఉంది.

రెండు మోడళ్లు కూడా సహజసిద్ధమైన ఆస్పిరేటెడ్ (ఎన్‌ఏ) ఇంజిన్ ఆప్షన్లను కొనసాగిస్తుండగా, అదనపు సౌకర్యం, సాంకేతికత, అ నుకూలమైన ఫీచర్లను కోరుకునే కస్టమర్ల కోసం సిట్రోయెన్ కొత్త ‘మాక్స్’  వేరియంట్‌ను పరిచ యం చేసింది.సి3 ఎయిర్‌క్రాస్ మాక్స్ ఎన్‌ఏ ధర రూ.11.62 లక్షలుగా ఉండ గా, బసాల్ట్ మాక్స్ ఎన్‌ఏ ధర రూ.11.34 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. కొత్త ‘మాక్స్’ వేరియం ట్లలో లెథరెట్ సీట్ కవర్లు, వెంటిలేటెడ్ ఫ్రం ట్ సీట్లు, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 16-ఇంచుల బ్లాక్ అల్లాయ్ వీల్స్, 360- డిగ్రీల కె మెరా, వైర్లెస్ చార్జింగ్, కారా ఏఐ అసిస్టెం ట్ వంటి ఫీచర్లున్నాయి. ఈ సరికొత్త లైన ప్కు అదనంగా, రెండు మోడళ్లు ఇప్పుడు కొత్త  గెలాక్సీ బ్లూ రంగులో కూడా లభిస్తున్నాయి.

మరిన్ని వార్తలు