రాధికా మర్చంట్ వజ్రాల వాచ్ ధర రూ.1.5 కోట్లు!
08-09-2026 | 09:01am
ముకేశ్ అంబానీ కోడలు రాధికా మర్చంట్ ధరించిన ఓ అరుదైన వాచ్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన రాధికా.. విలాసవంతమైన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఆమె ధరించిన వాచ్ ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. రాధికా మర్చంట్ ధరించిన ఈ వాచ్ ప్రముఖ లగ్జరీ వాచ్ బ్రాండ్ పటెక్ ఫిలిప్‌కు చెందినదిగా తెలుస్తోంది. 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో రూపొందించిన ఈ అరుదైన టైమ్‌పీస్‌లో ఏకంగా 1,700కు పైగా వజ్రాలను పొదిగినట్లు సమాచారం. ‘ది ఇండియన్ హోరాలజీ’ ప్రకారం.. ఈ వాచ్ విలువ సుమారు 1,60,000 అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారత కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.1.51 కోట్లు. దీంతో రాధికా మర్చంట్ ధరించిన ఈ ఖరీదైన వాచ్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.