సర్పంచుల ఫోరం అధ్యక్షుడికి స్వధర్మ ఫౌండేషన్ సన్మానం

15-09-2026 | 06:37pm

ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలo సర్పంచుల ఫోరం(Indravelli Mandal Sarpanch Forum) నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పిట్టబొంగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ మడావి ఇంద్రదేవ్ ను స్వధర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  సన్మానం చేసారు. మంగళవారం పిట్టబొంగరం గ్రామ పంచాయతీ(Pittabongaram Gram Panchayat) కార్యాలయంలో నూతన సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపినట్టు ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుడెల్లి అశోక్ తెలిపారు. మండలంలోని అన్నీ గ్రామ పంచాయతీల అభివృద్ధికి మరింత చైతన్యవంతంగా కృషి చేయాలనీ కోరినట్టు అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐటీడీఏ చైర్మన్ సిడాం భీమ్ రావు పంచాయతీ సెక్రటరీ నాతరి అనిత నాయకులు సిడాం ప్రభు జుగాదిరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు