హైదరాబాద్‌లో లెగో గ్రూప్ మొదటి లెగో సర్టిఫైడ్ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్, సెప్టెంబర్ 20 2026: లెగో గ్రూప్(Lego Group) ఈ రోజు ఇనార్బిట్ మాల్లో హైదరాబాద్ యొక్క మొట్టమొదటి లెగో సర్టిఫైడ్ స్టోర్(Lego Certified Store)ను ప్రారంభించింది. తద్వారా ముత్యాల నగరమైన హైదరాబాద్‌కు తమ విశిష్టమైన సృజనాత్మకత, ఆటల ప్రపంచాన్ని తీసుకువచ్చింది. ఆంపిల్ గ్రూప్‌తో కలిసి ప్రారంభించబడిన 3,500 చదరపు అడుగుల ఈ స్టోర్, హైదరాబాద్‌లో పెరుగుతున్న లెగో అభిమానులను ఒకచోట చేర్చనుంది.
వారు సరదాగా నేర్చుకోవడంతో పాటుగా కొత్త విషయాలను కనుగొనడం వంటి ప్రత్యేకమైన లెగో అనుభవాన్ని ఆస్వాదించడానికి ఒక వేదికను అందిస్తుంది. నగర స్ఫూర్తితో రూపొందించిన, నిజ పరిమాణంలో నిర్మించిన కట్టడాలతో సహా 750కి పైగా లెగో సెట్లు కలిగిన ఈ స్టోర్ భారతదేశంలో లెగో గ్రూప్ యొక్క ఎనిమిదవ సర్టిఫైడ్ స్టోర్ గానూ, 2026లో ప్రారంభించబడిన నాల్గవ స్టోర్ గానూ నిలుస్తుంది. నటుడు, నిర్మాత, పారిశ్రామికవేత్త రానా దగ్గుబాటి(Rana Daggubati) ఈ స్టోర్‌ను ప్రారంభించి, ఒక ప్రత్యేక లెగో మొజాయిక్‌ను ఆవిష్కరించారు.
హైదరాబాద్‌ను కేవలం ఒక నగరంగానే కాకుండా, ఒక అనుభూతిగా ఆవిష్కరిస్తూ, మాస్టర్ బిల్డర్ రీతమ్ భట్నాగర్ 49,200 లెగో® బ్రిక్స్ ను ఉపయోగించి ఈ మొజాయిక్‌ను సృష్టించారు. ఇక్కడ 'పిక్-ఎ-బ్రిక్'వాల్, ప్లే టేబుల్స్ మరియు 'బిల్డ్-ఎ-మినీ' స్టేషన్లతో పాటు, లెగో ® ఆర్ట్ గుస్తవ్ క్లిమిట్ - ది కిస్, ది మినిస్ట్రీ అఫ్ మ్యాజిక్ - కలెక్టర్స్ ఎడిషన్, లెగో® టెక్నిక్ కనిగ్సెగ్ సడైర్స్ స్పియర్ మరియు మరెన్నో కొత్త ఉత్పత్తులతో సహా మొత్తం 250 రకాల లెగో సెట్లు అందుబాటులో ఉంటాయి.
లెగో ఇండియా కంట్రీ మేనేజర్ భావన మండన్ మాట్లాడుతూ "హైదరాబాద్ యొక్క సాంస్కృతిక వైభవం, ఉత్సాహభరితమైన వాతావరణం సృజనాత్మక ఆలోచనలకు చక్కటి వేదికగా నిలుస్తున్నాయి. సంవత్సరాలు గడిచేకొద్దీ, ఈ నగరంలోని ప్రజలు, కుటుంబాలు కలిసి కనెక్ట్ అవ్వడానికి, ఆనందించడానికి అర్థవంతమైన అనుభవాలను చురుకుగా కోరుకునే ఒక సమాజంగా ఎదిగారు, అందువల్ల మా కొత్త లెగో సర్టిఫైడ్ స్టోర్‌కు ఇది సహజమైన నిలయంగా మారిందన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో రానా దగ్గుబాటి మాట్లాడుతూ "హైదరాబాద్‌లో చివరకు ఒక లెగో సర్టిఫైడ్ స్టోర్ రావడం చాలా సంతోషంగా ఉంది. లెగో సెట్లను ఏ వయసు వారైనా ఆస్వాదించవచ్చు; మా కుటుంబంతో కలిసి ఈ స్టోర్‌ను అన్వేషిస్తూ గొప్ప సమయాన్ని గడుపుతానని నాకు తెలుసు. హైదరాబాద్‌కు కొత్త, సరదాగా ఉండే అంశాలు రావడం ఎప్పుడూ సంతోషకరమైన విషయమే, ఈ ప్రారంభోత్సవంలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు.